- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ లో దారుణం...నడిరోడ్డుపై మహిళ బట్టలు చించి !
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు గ్యాంగ్ రే**ప్ చేసేందుకు ప్రయత్నించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకు వచ్చినా ఏదో ఒక మూలన అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు కామాంధులు. పొద్దున లేస్తే చాలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన వార్తలు నిత్యం వినాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన మరోటి తెరపైకి వచ్చింది. నడిరోడ్డుపైన ఓ మహిళ బట్టలు చించేసి, సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు కొంతమంది దుర్మార్గులు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నడిరోడ్డుపైన ఓ మహిళ బట్టలు చించేసి
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు గ్యాంగ్ రే**ప్ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న మార్కెట్ కు వెళ్లి వస్తుండగా బాధిత మహిళను అడ్డుకున్నారు. ఆ తర్వాత బలవంతం చేయబోయారు. ఈ క్రమంలోనే ఆమె బట్టలు కూడా చించేశారు. ఇక ఈ సంఘటనపై నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది బాధితురాలు. నడిరోడ్డుపైన తన ప్రైవేట్ పార్ట్ ను తాగుతూ దారుణంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది.
మొత్తం ముగ్గురుపైన ఆ బాధిత మహిళ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఎన్డీఏ కూటమిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సంఘటనలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడు ఢిల్లీకి పరారైనట్లు సమాచారం. దీంతో ఢిల్లీకి వెళ్లి మరీ, పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది. క్లిక్






