మెట్టినింట్లో నరకం.. పెళ్లయిన 5 నెలలకే మహిళ అనుమానాస్పద మృతి!

by Gantepaka Srikanth |

వివాహమైన ఐదు నెలలకే ఓ 31 ఏళ మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

మెట్టినింట్లో నరకం.. పెళ్లయిన 5 నెలలకే మహిళ అనుమానాస్పద మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహమైన ఐదు నెలలకే ఓ 31 ఏళ మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్త, అత్తామామల వేధింపుల వల్ల జరిగిన హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ట్విషా శర్మకు ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఆమె అదనపు కట్నం కోసం లేదా ఇతర కారణాలతో మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం. ట్విషా శర్మను ఆమె భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో బలవంతంగా గర్భస్రావం(అబార్షన్) చేయించారని వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

వేధింపుల పర్వం..

పెళ్లయిన కొద్దిరోజులకే సంతోషంగా ఉండాల్సిన ట్విషా శర్మ, గృహ హింసకు గురవుతూ మనస్తాపానికి లోనైందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిరంతరం ఆమెను వేధించడమే గాకుండా, తీవ్రమైన ఒత్తిడికి గురిచేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భోపాల్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ట్విషా మరణానికి సంబంధించిన కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు చేసిన తీవ్రమైన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు, భర్త, అత్తమామలను వివారించనున్నట్లు సమాచారం గృహ హింస, కట్నం వేధింపుల కారణంగా మరో యువతి బలికావడం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story