పురుగుల మందు తాగి మహిళా మృతి

by Ratna Kumari |

దిశ, కనగల్: పురుగుల మందు తాగి మహిళా మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. క‌నగల్ ఎస్సై కే.రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కనగల్ గ్రామానికి

పురుగుల మందు తాగి మహిళా మృతి
X

దిశ, కనగల్: పురుగుల మందు తాగి మహిళా మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. క‌నగల్ ఎస్సై కే.రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కనగల్ గ్రామానికి చెందిన కందిమల్ల పూజ (19) భర్త కోటిరెడ్డి పూజ తన అవసరాల కోసం పెళ్లిలో పెట్టిన ఆమె నగలు, పుస్తెలతాడు డబ్బుల కోసం వాటిని అమ్ముకోవడంతో నగలు అమ్ముకున్న విషయం ఎక్క బయటపడుతుందో అని మనస్థాపానికి గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి హుటాహుటిన ఆసుపత్రికి నల్గొండకు తరలించారు. దీంతో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. మృతురాలు తండ్రి ఒంటెద్దు నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Next Story