లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని మహిళ మృతి

by Ajay Maddhiboyina |

లిఫ్టులో జుట్టు ఇరుక్కుని మ‌హిళ మృతి చెందిన షాకింగ్ ఘ‌ట‌న చెన్నై‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు హార్డ్ వేర్ స్టోర్‌లో పనిచేస్తున్న 52ఏళ్ళ సుమతి గాంధీమార్కెట్ లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు వెళ్లింది.

లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని మహిళ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: లిఫ్టులో జుట్టు ఇరుక్కుని మ‌హిళ మృతి చెందిన షాకింగ్ ఘ‌ట‌న చెన్నై‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు హార్డ్ వేర్ స్టోర్‌లో పనిచేస్తున్న 52ఏళ్ళ సుమతి గాంధీమార్కెట్ లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు వెళ్లింది. గ్రౌండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా దాని డోర్‌లో ఆమె జుట్టు ఇరుక్కుపోయింది.

ఈ క్రమంలో తలకు తీవ్రగాయాలు అవ్వడంతో లిఫ్టులోనే చనిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని మ‌హ‌త్మాగాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలు తిన్నూర్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌తో లిఫ్ట్ ఎక్కాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. లిఫ్టు నిర్వ‌హ‌ణ‌లో లోపాలు ఉండ‌టం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

Next Story