- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేబీస్ సోకిందనే అనుమానంతో మహిళ ఆత్మహత్య, అదే గదిలో కూతురి మృతదేహం..మిస్టరీగా మారిన ఘటన!
రేబిస్ సోకిందనే అనుమానంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆమె కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ పట్టణంలో కొత్తగంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రేబిస్ సోకిందనే అనుమానంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆమె కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ పట్టణంలో కొత్తగంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నరేష్, యశోద అనే దంపతులకు ఇద్దరు పిల్లలు అనురాగ్, అక్షర ఉన్నారు. కాగా సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో కొడుకు లక్కీకి రేబిస్ సోకింది ట్రీట్‌మెంట్ ఇప్పించండి అంటూ బోర్డుపై రాసి యశోద ఆత్మహత్య చేసుకుంది. ఉదయం 10 గంటలకు నరేష్ ఇంటికి ఫోన్ చేయగా కుమారుడు అనురాగ్ లిఫ్ట్ చేసి అమ్మ బెడ్రూమ్ నుండి బయటకు రావడంలేదని చెప్పాడు. దీంతో నరేష్ వెంటనే పక్కింటివారికి ఫోన్ చేయగా వాళ్లు వచ్చి చూసేసరికి యశోద బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించింది.
మరోవైపు వారి మూడేళ్ల కూతురు అక్షర సైతం అనుమానస్పద స్థితిలో మృతిచెందినట్టు కనిపించింది. ఈ ఘటనపై స్పందించిన యశోద భర్త నరేష్..తమ ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధి కుక్కలు ఎంగిలి చేశాయని, వాటినే తిరిగి వంటలో వాడటంతో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. రేబిస్ టీకాలతో పాటు ఇతర వైద్యం చేయించుకున్నా చర్మ వ్యాధుల కారణంగా తన భార్య తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రేబిస్ బయంతో తన భార్య ఆత్మహత్య చేసుకుందని అనుమానించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
- Tags
- mahbubnagar






