మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం

by Chintha Aamani |

కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ మహిళ కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం
X

దిశ, కామారెడ్డి : కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ మహిళ కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడ ఉన్నవారు చూసి కుంటలో ఎవరో దూకి మునుగుతున్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ రెండవ ఎస్‌ఐ భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని, నీటిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను బయటకు తీశారు. ప్రాథమిక చికిత్సలో భాగంగా కడుపులోని నీటిని బయటకు తీసి ఆమె ప్రాణాలను రక్షించి, భద్రంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవునిపల్లి పోలీసులు తమ ధైర్యం, చాకచక్యంతో ఒక మహిళ ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచారు. ఒక మహిళ ప్రాణాలను సాహసోపేత చర్యల ద్వారా కాపాడిన ఎస్‌ఐ భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర క్యాష్ రివార్డ్ తో అభినందించారు.

Next Story