Viral video: అప్పు తిరిగివ్వడం లేదని చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

by Ajay Maddhiboyina |

ఓ మహిళ ఇచ్చిన అప్పు రాబట్టలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.

Viral video: అప్పు తిరిగివ్వడం లేదని చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు డబ్బులు అడిగి ఆ త‌ర‌వాత తిరిగివ్వ‌మంటే మాత్రం చాలా మంది ముఖం చాటేస్తారు. అప్పుకోసం ఇంటిచుట్టూ తిరిగి ఆ త‌ర‌వాత తిరిగి ఇవ్వ‌కుండా వాళ్ల ఇంటిచుట్టూ తిప్పించుకుంటారు. మొదట వడ్డీ కోసం ఆశించి అప్పులు ఇచ్చినా తరవాత అసలు తిరిగిచ్చినా సరిపోతుందని అనుకుంటారు. ఇక తాజాగా ఓ మహిళ ఇచ్చిన అప్పు రాబట్టలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.

రాధిక అనే మహిళ ఓ వ్యక్తికి రూ.1 లక్ష అప్పు ఇవ్వగా అది తిరిగి ఇవ్వకపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య యత్నం చేసింది. పోలీసులు చెరువులోకి దిగి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ తనను వదిలేయాలని, తాను బతకనని గొడవ చేసింది. చివరికి పోలీసులు ఆమె చేయి పట్టుకుని చెరువులో నుండి పైకి లేపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. VIDEO

Next Story