- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాంగ్ కాల్‌తో లవ్‌మ్యారేజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ప్రియుడు.. కుటుంబాన్ని కాదన్నదని దారుణం
సోషల్ మీడియాలో ఉన్న పరిచయాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఉన్న పరిచయాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. తమ జీవితాలనే కాదు.. కుటుంబాలను కూడా చిక్కుల్లోకి, కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఓ ఇల్లాలికి సోషల్ మీడియాపై ఉన్న మోజు.. చావు అంచుల వరకూ తీసుకెళ్లింది. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ కు చెందిన వాసాల శ్రీధర్ (34), ఖమ్మం జిల్లాకు చెందిన కల్యాణి (33)కి 13 సంవత్సరాల క్రితం రాంగ్ కాల్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పండంటి కాపురానికి గుర్తుగా ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. జీవనోపాధికోసం హైదరాబాద్ కు వచ్చిన వీరు పీజేఆర్ నగర్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కల్యాణి ఇన్ స్టాగ్రామ్ లో తరచూ రీల్స్ చేస్తూ యాక్టివ్ గా ఉంటోంది. ఆమెకు ఏపీలోని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాపురంలో చిచ్చుపెట్టింది. కల్యాణి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన భర్త తన పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోగా.. ప్రియుడి కోసం భర్తకే విడాకులిస్తానని తెగేసి చెప్పడంతో శ్రీధర్ కోపం కట్టలు తెంచుకుంది.
ఈ విషయం పెద్దల వరకూ వెళ్లడంతో కల్యాణికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె నిర్ణయాన్ని మార్చుకోనంటే మార్చుకోననడంతో.. సోమవారం దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కల్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడటంతో.. శ్రీధర్ కోపంతో కత్తి తీసుకుని ఆమె గొంతు, ముఖం, మణికట్టుపై దాడి చేసి.. తానూ రెండు చేతుల మణికట్టును కోసుకున్నాడు. తమను కాపాడాలంటే కల్యాణి కేకలు వేయడంతో.. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కల్యాణి పరిస్థితి విషమంగా ఉండగా.. శ్రీధర్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






