ఉద్యోగం కోసం నా భార్య చంపేస్తానంటుంది..భర్త ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

దేశంలో భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ భర్తలను వేధించిన కేసులు,

ఉద్యోగం కోసం నా భార్య చంపేస్తానంటుంది..భర్త ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో భార్యా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ భర్తలను వేధించిన కేసులు, భర్తలను హతమార్చిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ భార్య ఉద్యోగం కోసం తన భర్తను హతమార్చేందుకు స్కెచ్ వేసింది. దీంతో భాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... బీహార్ లోని లోయాకు చెందిన సుమిత్ కుమార్ రైల్వేలో లోకో పైలెట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సుమిత్ తన భార్య తన ఉద్యోగం కోసం ఆరాటపడుతోందని, అందుకోసం చంపేందుకు చూస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇటీవల మీరట్‌లో భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చిన రీతిలో చంపుతానని బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య ఆమె సోదరుడు తనను మీరట్‌లో భార్య హతమార్చిన తరహాలో చంపాలని మాట్లాడుకునే సమయంలో విన్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి భార్యను విచారిస్తున్నట్టు తెలిపారు. ఇక దేశంలో భర్తపై దారుణాలు పెరుగుతున్న వేళ రోజుకో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిస్తోంది. ఈ క్రమంలోనే మగవారికోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

Next Story