- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోరం.. పది నెలల తర్వాత బయటపడ్డ భర్త అస్థిపంజరం.. డౌట్ రాకుండా సినిమాటిక్ ప్లాన్.. కీలకపాత్రల్లో టీ, సాల్ట్
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. పది నెలలు బాగానే మెయింటెన్ చేసిన.. చనిపోయిన వ్యక్తి

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. పది నెలలు బాగానే మెయింటెన్ చేసిన.. చనిపోయిన వ్యక్తి తల్లి ఎంట్రీతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అసలు నిజం బయటపడింది.
బిథూర్‌కు చెందిన లక్ష్మీ భర్త శివ్‌బీర్ సింగ్‌తో బాగానే ఉన్నా మేనల్లుడు అమిత్ సింగ్‌పై మనసు పారేసుకుంది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలిసిన భర్త హెచ్చరించడంతో.. గతేడాది నవంబర్ 2న టీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. స్పృహ కోల్పోయాక అమిత్ గొడ్డలితో శివ్‌బీర్‌ను హతమార్చాడు. చనిపోయాడని నిర్ధారించుకునేందుకు లక్ష్మీ కూడా భర్తను బాదింది. ఆతర్వాత శవాన్ని ఇంటివెనుక పాతిపెట్టి.. బాడీ కుళ్లిపోయేందుకు 12 కిలోల ఉప్పు పోశారు. ఇలా పది నెలలు గడిచాయి. తాము సేఫ్ అనే అనుకున్నారు ప్రియుడు, ప్రియురాలు. కానీ శివ్ బీర్ సింగ్ తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. గత నెల ఆగస్టు 19న మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. దీంతో విచారించిన పోలీసులు.. తమదైన స్టైల్‌లో విచారిస్తే నిందితులు తప్పు ఒప్పుకున్నారు. పోలీసులు ఇంటి వెనుక పాతిపెట్టిన అస్థిపంజరాన్ని బయటకు తీశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






