- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను హత్య చేసిన భర్త.. పూజల పేరుతో అడవిలోకి తీసుకెళ్లి హత్య..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది.

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీకి ఇంగోలి వందన (40) అనే మహిళను భర్త శంకర్ హత్య చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందర్యనగర్ కాలనీకి చెందిన ఇంగోలి వందనకు ఆరోగ్యం బాగా లేదని పూజలు చేయిస్తున్న భర్త ఇంగోలి శంకర్ ఈనెల 2న లక్ష్మిపూర్ చెక్పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తీసుకువచ్చాడు. అనంతరం ఆ ప్రాంతంలో కొబ్బరి కాయ,పసుపు, పెరుగుతో పూజ చేసినట్లు భార్యను నమ్మించి బండ రాళ్లతో తలపై కొట్టి హత్య చేసినట్లు తెలిపారు.
తన తండ్రిపై అనుమానం ఉందని కూతురు ఇంగోలి ప్రియాంక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదయింది.ఈ మేరకు పోలీసులు శంకరన్ ను విచరించగా..తన భార్యను తానే నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు,హత్యకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.హత్య జరిగిన ప్రదేశంలో పూజ సామాగ్రి ఉండడంతో..క్షుద్ర పూజల నెపంతోనే భార్యను హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.మరోవైపు అక్రమ సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇందులో టూ టౌన్ సీఐ కరుణాకర్,రూరల్ సీఐ ఫణిందర్,ఎస్సై రాధిక ఉన్నారు.






