TG: నా భర్తను చంపితే రూ.35 వేలు ఇస్తా.. ప్రియుడితో కలిసి భార్య స్కెచ్

by Gantepaka Srikanth |

నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

TG: నా భర్తను చంపితే రూ.35 వేలు ఇస్తా.. ప్రియుడితో కలిసి భార్య స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్(Nizamabad) జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు దిలీప్‌తో కలిసి భర్త రమేష్‌ను భార్య సౌమ్య కిరాతకంగా హత్య(Murder) చేసింది. భర్తను చంపేందుకు ఏకంగా సుపారీ గ్యాంగ్‌‌ను భార్య సౌమ్య అప్రోచ్ అయింది. రూ.35 వేలకు డీల్ కుదుర్చుకుంది. డబ్బులు తీసుకున్న తర్వాత సుపారీ గ్యాంగ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చేసేదేంలేక ప్రియుడితో కలిసి భార్య సౌమ్యనే భర్త గొంతు నులిమి చంపేసింది. రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్‌‌తో పాటు సుపారీ గ్యాంగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అసలు నిజం ఒప్పేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు.

Next Story