తెలంగాణ సంచలనం.. సినిమా స్టైల్లో ప్రియుడితో భర్తను చంపేసిన భార్య

by Gantepaka Srikanth |

భర్తలను భార్యలు హతమారుస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.

తెలంగాణ సంచలనం.. సినిమా స్టైల్లో ప్రియుడితో భర్తను చంపేసిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: భర్తలను భార్యలు హతమారుస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో జరిగింది. సినీఫక్కీలో భర్తను భార్య హత్య(Wife Kills Husband) చేసింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లాలోని కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతిచెందారు. స్వామి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కారుతో ఢీ కొట్టారు. యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన స్వామిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయితే.. ముందు పోలీసులు హత్యగా అనుమానించారు. విచారణలో భార్యే.. వ్యూహాత్మకంగా హతమార్చినట్లు నిర్ధారణ అయింది. కారుని రెంట్‌కు తీసుకుని మరీ స్వామిని చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story