- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భార్య భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భార్య భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అహోబిలం పద్మావతి భార్య భర్తలు. కాగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకుంటే ప్రియుడితో ఉండొచ్చని పద్మావతి భావించింది.
తన భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడిని కోరింది. దీంతో ప్రియురాలి కోసం బెంగుళూరు నుండి వచ్చిన ప్రియుడు చెన్నబసవ బైక్ పై వెళుతున్న అహోబిలంపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. మరణించడంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఈ నెల 3న తొగలగల్లు, దొడగొండ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డులో డెడ్ బాడీ కనిపించగా అది అహోబిలం దే అని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిందని నిర్దారించారు. నిందితులు పద్మావతి, చెన్నబసవలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






