లవర్‍తో భార్య జంప్.. పట్టుకుని కత్తితో పొడిచి చంపిన భర్త

by Prasad Jukanti |

వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో పారిపోయిన భార్తపై తీవ్ర నిర్ణయం తీసుకుంన్నాడో భర్త

లవర్‍తో భార్య జంప్.. పట్టుకుని కత్తితో పొడిచి చంపిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రియుడితో పారిపోయిన భార్యను పట్టుకుని కిరాతకంగా చంపాడో భర్త. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‍లో చోటు చేసుకుంది. జహీరాబాద్ కు చెందిన కవిత (29), సిద్దారెడ్డి భార్యభర్తలు. కవితకు పవన్ రెడ్డి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో గత నెల 27న తన ప్రియుడు పవన్‍తో కలిసి కవిత పారిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిత అదృశ్యమైనట్లు మార్చి 30న జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు జడ్చర్లలో ప్రియుడు పవన్‍తో కలిసి కవిత ఉన్నట్లు గుర్తించారు.

తీసుకువస్తుండగా ఎటాక్:

దీంతో కవితను తిరిగి జహీరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు జడ్చర్ల బయలుదేరారు. పోలీసులతో పాటు భర్త సిద్ధారెడ్డి సైతం వెళ్లాడు. అక్కడి నుంచి కవితను తీసుకుని కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే భార్య చేసిన పనికి లోలోపల రగిలిపోతున్న సిద్ధారెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది సమీపంలోకి కారు రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. కవిత గొంతులో కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కవితను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story