- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో దారుణం.. భర్త మర్మాంగం కోసేసిన భార్య
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య తన భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య తన భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొన్నేళ క్రితం అస్సాంకు చెందిన బిదాన్ (33) కోయంబత్తూరుకు ఉపాధి నిమిత్తం వచ్చారు. అత్తిపాళయంలోని ఓ రెసిడెన్షియల్ భవన సముదాయంలో బిదాన్ ప్లంబర్‌గా పనిచేస్తుండగా అతనికి భార్య జిండి (36), ఓ కుమార్తె ఉన్నారు. అయితే భార్య, కుమార్తె అసోంలో ఉండగా బిదాన్ ఒంటరిగా కోయంబత్తూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ స్థానిక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో కోయంబత్తూరు వచ్చి, నిలదీయగా తనకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని బుకాయించాడు. అయినా అనుమానం తీరకపోవడంతో భార్య కోయంబత్తూరులోనే ఉంటూ భర్తతో కలిసి పనికి వెళుతోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భర్తతో కలిసి పనికివెళ్లగా బిదాన్ ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అదే రోజు బిదాన్ ఫుల్లుగా మద్యం తాగి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో భార్య కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసి, బయట పడేసింది. బాధితుడు తీవ్ర బాధతో కేకలు పెట్టగా, చుట్టుపక్కల వారు వచ్చి అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






