రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చినా తీరని దాహం.. వేధింపులతో మహిళ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఎన్నో చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా వేధింపులు మాత్రం ఆగ‌డంలేదు. ముఖ్యంగా వ‌ర‌క‌ట్న వేధింపులు ఇప్ప‌టికీ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ల‌క్ష‌ల క‌ట్నం ఇచ్చినా కొంద‌రు ఇంకా కావాలి అంటూ భార్య‌ల‌ను, వారి కుటుంబాల‌ను వేధిస్తున్నారు.

రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చినా తీరని దాహం.. వేధింపులతో మహిళ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఎన్నో చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా వేధింపులు మాత్రం ఆగ‌డంలేదు. ముఖ్యంగా వ‌ర‌క‌ట్న వేధింపులు ఇప్ప‌టికీ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ల‌క్ష‌ల క‌ట్నం ఇచ్చినా కొంద‌రు ఇంకా కావాలి అంటూ భార్య‌ల‌ను, వారి కుటుంబాల‌ను వేధిస్తున్నారు. తాజాగా అద‌న‌పు క‌ట్నం వేధింపులను త‌ట్టుకోలేక ఓ మ‌హిళ మృతి చెందింది. ఇమె ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేదంటే భ‌ర్త‌నే హ‌త్య చేశాడా అనేది కూడా మిస్ట‌రీగా మారింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నోయిడాకు చెందిన దీపికాకు జల్పురకు చెందిన హ్రితిక్ అనే వ్యక్తితో డిసెంబర్ 11, 2024లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.50 లక్షలు, ఖరీదైన కారు సంజయ్‌కి కట్నంగా ఇచ్చారు.

అయితే పెళ్లైన ఏడాదికే సంజయ్, అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం దీపికను వేధించ‌డం మొద‌లుపెట్టారు. ఎలాగైనా మ‌రో రూ.50 ల‌క్ష‌లు క‌ట్నంగా తీసుకురావాల‌ని వేధిస్తున్నారు. కాగా ఈ నెల 17న దీపిక త‌న భ‌ర్త కొడుతున్నాడు అంటూ పుట్టింటికి ఫోన్ చేసి క‌న్నీళ్లు పెట్టుకుంది. ఆ త‌ర‌వాత గంట‌కే మీ కూతురు మూడో అంత‌స్తు నుండి ప‌డిపోయి మ‌ర‌ణించింది అంటూ హ్రితిక్ కుటుంబ స‌భ్యులు ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు భ‌ర్త‌ను అదుపులోకి తీసుకున్నారు. త‌న కూతురి మృతిపై తండ్రి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెకు కొట్టార‌ని వాళ్లే హ‌త్య చేసి ఉంటార‌ని చెబుతున్నారు.

Next Story