- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: అతి కిరాతకంగా భర్తను చంపిన భార్య.. పోలీసులకు ఏం చెప్పిందో తెలుసా?
హైదరాబాద్(Hyderabad) శివారులోని వనస్థలిపురం(Vanasthalipuram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య అతికిరాతకంగా హత్య(Murder) చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) శివారులోని వనస్థలిపురం(Vanasthalipuram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య అతికిరాతకంగా హత్య(Murder) చేసింది. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులతో సహా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంలో నివాసముండే కిషన్-శిరీష దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల గొడవలు మరింత ముదరడంతో ఇంటినుంచి బయటకు వచ్చి హిల్స్ కాలనీలో శిరీష ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ‘‘సరే జరిగిందేదో జరిగింది.. ఓసారి ఇంటికి రా మాట్లాడుకుందాం’’ అని భర్తను ఇంటికి పిలిచింది. అనంతరం ఇద్దరి సాయంతో చున్నీతో ఉరి వేసి చంపింది. కిషన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శిరీష సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం కిషన్-శిరీష లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






