భర్తను చంపి.. శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకున్న భార్య

by Sujitha Rachapalli |

హర్యానా పానిపట్ జిల్లాలోని సోనిపట్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఖర్చులకు సరిపడేలా డబ్బులు తేవడం లేదని భర్తను చంపేసింది భార్య. ఆ తర్వాత అతని శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకుంది.

భర్తను చంపి.. శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకున్న భార్య
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా పానిపట్ జిల్లాలోని సోనిపట్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఖర్చులకు సరిపడేలా డబ్బులు తేవడం లేదని భర్తను చంపేసింది భార్య. ఆ తర్వాత అతని శవం పక్కన కూర్చుని మేకప్ వేసుకుంది. అరవై ఏళ్ల సురేశ్ త్రీ వీలర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ మధ్య అతనికి అనారోగ్యంగా ఉండటంతో.. ఇంటికి సరిపోయేంత డబ్బులు సంపాదించలేకపోయాడు. దీంతో అతన్ని ఎక్కడి నుండి అయినా డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి చేసింది పూనమ్. కానీ అతను తన డిమాండ్ నెరవేర్చలేకపోవడంతో చనిపోయేదాక కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడే దర్జాగా రెడీ అయిందని సమాచారం. కాగా పోలీసులు ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Next Story