బావిలో తేలిన వితంతు శరీర భాగాలు.. ఏం చేశారో తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 05:13:45  IST  )

వితంతు శరీర భాగాలను ఏడు ముక్కలుగా కట్ చేసి బావిలో పడేసిన భయానక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది.

బావిలో తేలిన వితంతు శరీర భాగాలు.. ఏం చేశారో తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: వితంతు శరీర భాగాలను ఏడు ముక్కలుగా కట్ చేసి బావిలో పడేసిన భయానక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిశోర్‌పురా గ్రామంలో రచనా యాదవ్ అనే వితంత నివాసం ఉంటుంది. అయితే, ఓ న్యాయరమైన వివాదం తలెత్తడంతో ఆమె కుటుంబానికి మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్ ఆమెకు సాయం చేశాడు. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధంగా మారింది. ఈ క్రమంలోనే తనను వివాహం చేసుకోవాలని రచనా యాదవ్ పదేపదే సంజయ్ పటేల్ వెంట పడింది. అందుకు అతడు తమది మర్యాద కుటుంబమని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో రచనా యాదవ్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ఆగ్రహంతో రగలిపోయిన సంజయ్ పటేల్ ఆమెను అంతమొదించాలని నిర్ణయించాడు.

అనుకుందే తడవుగా ఆగస్టు 8న పొలానికి వెళ్లి వస్తున్న రచనా యాదవ్‌ను సంజయ్ పటేల్ తన మేనల్లుడు సందీప్ పటేల్, అనుచరుడు ప్రదీప్ అహిల్వార్‌లో కలిసి కిడ్నాప్ చేసిన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ముందు ఆమె గొంతుకు తాడి బిగించి ప్రాణం పోయేలా చేశారు. అనంతరం తల, కాళ్లు, చేతులు వేరు చేశారు. అలా మృతదేహాన్ని ఏడు ముక్కలుగా గోనె సంచుల్లో నింపి గ్రామ సమీపంలోని బావి, ఓ వంతెన వద్ద పడేశారు. అయితే, ఆగస్టు 13న ఓ రైతు పొలానికి వెళ్తుండగా.. దుర్వాసన వచ్చింది. గోనె సంచిని విప్పి చూడగా.. అందులో ఓ మహిళ మృతదేహం కనబడింది. అంతకు ముందు రచనా యాదవ్ అచూకీ కోసం కుటుంబ సభ్యులు చాటింపు వేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు కూడా వేశారు.

ఈ నేపథ్యంలోనే కిశోర్‌పురా గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందని రచనా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆ అవశేషాలను చూసి వారు ఆ మృతదేహం రచనా యాదవ్‌గా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఝాన్సీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఈ కేసును ఛేదించడానికి 8 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. స్పాట్‌లో దొరికిన సాక్ష్యాధారాల మేరకు హత్యకు పాల్పడింది గ్రామ మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్‌గా నిర్ధారించారు. విచారణలో భాగంగా చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు. దీంతో సంజయ్ పటేల్‌తో పాటు అతడి మేనల్లుడు సందీప్ పటేల్, అనుచరుడు ప్రదీప్ అహిల్వార్‌‌లను అరెస్ట్ చేశారు.

Next Story