రోడ్డు క్రాస్ చేస్తుండ‌గా కంటైన‌ర్ ఢీ.. వంట మాస్ట‌ర్ దుర్మ‌ర‌ణం

by Ratna Kumari |   (  Updated:2026-03-03 12:08:05  IST  )

రోడ్డు క్రాస్ చేస్తుండగా కంటైనర్ లారీ ఢీ కొనడంతో వంట మాస్టర్ దుర్మరణం పాలైన సంఘటన భిక్కనూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు క్రాస్ చేస్తుండ‌గా కంటైన‌ర్ ఢీ.. వంట మాస్ట‌ర్ దుర్మ‌ర‌ణం
X

దిశ‌, భిక్క‌నూరు : రోడ్డు క్రాస్ చేస్తుండగా కంటైనర్ లారీ ఢీ కొనడంతో వంట మాస్టర్ దుర్మరణం పాలైన సంఘటన భిక్కనూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజ‌నేయులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భిక్క‌నూరు ప‌ట్ట‌ణానికి చెందిన గ‌డ్డ‌మీది చంద్రం (43) దాబా హోట‌ల్ లో వంట మాస్ట‌ర్ గా ప‌ని చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల కోసం బ‌స్వాపూర్ గ్రామానికి వెళ్లి.. తిరిగి స్వ‌గ్రామానికి వ‌స్తూ రోడ్డు క్రాస్ చేసే స‌మ‌యంలో కామారెడ్డి వైపు నుంచి హైద‌రాబాద్ వైపు వెళ్తున్న కంటైన‌ర్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్ర‌మాదంలో చంద్రం తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణ‌పాయ స్తితిలో కొట్టుమిట్టాడుతుండ‌గా.. అంబులెన్స్ కి కాల్ చేశారు. అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ చంద్రం మ‌ర‌ణించాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించిన‌ట్టు ఎస్సై ఆంజ‌నేయులు తెలిపారు.

Next Story