- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ మెసేజ్ వివాదం.. క్షణికావేశంలో దారుణ హత్య
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సామాజిక మాధ్యమాల్లో మొదలైన మాటల యుద్ధం తీవ్ర ఘర్షణకు దారి తీసి, మానుపురి కృపాకర్ (50) అ

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో సామాజిక మాధ్యమాల్లో మొదలైన మాటల యుద్ధం తీవ్ర ఘర్షణకు దారి తీసి, మానుపురి కృపాకర్ (50) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక పద్మశాలి సంఘ అధ్యక్ష పదవికి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన మెసేజ్‌ల యుద్ధం ఈ విషాదానికి దారితీసింది.
పద్మశాలి సంఘ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అప్పం శ్రీనివాస్, శ్రీరాముల రాములు మధ్య మొదలైన చాటింగ్ వివాదంలో, కృపాకర్ అప్పం శ్రీనివాస్ మెసేజ్‌కి క్లాప్ ఈమోజీతో రిప్లై ఇవ్వడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. దీనిపై ఆగ్రహించిన రాములు, సోమవారం రాత్రి కృపాకర్‌ను ఫోన్‌లో దూషించాడు.
ఈ విషయాన్ని కృపాకర్ మంగళవారం పద్మశాలి సంఘ భవనానికి వెళ్లి ఎన్నికల కమిటీకి వివరించేందుకు ప్రయత్నించగా, అక్కడ రాములు అనుచరులు అతనిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కృపాకర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సంఘటనపై కుటుంబ సభ్యులు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.






