- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సిటీక్రైం : ఏపీకే ఫైల్స్ పేరుతో వచ్చిన వాట్సాప్ మెసేజ్‌ను క్లిక్ చేయడంతో ఓ వ్యాపారి నిమిషం వ్యవధిలో ₹1.50 లక్షలు కోల్పోయాడు. అతని ప్రమేయం లేకుండానే కేవలం 60 సెకండ్లలో ఆరు లావాదేవీలు జరిపి, సైబర్ నేరగాళ్లు నగదును ఖాతా నుంచి కాజేశారు. ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా.. హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (43)కి తన వాట్సాప్‌కు "ఆర్‌టిఓ-ఈ చలాన్" పేరుతో ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన వాట్సాప్ నంబర్ డిపిలో "ఆర్‌టిఓ AIFMVDE" (ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటర్ వెహికిల్స్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్) అని ఉన్నది.
దీంతో వ్యాపారి ఆ ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేశాడు. ఒక నిమిషంలో అతని కరెంట్ అకౌంట్ నుంచి ₹1.50 లక్షలు ఇతర ఖాతాల్లోకి బదిలీ అయినట్లు గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి తన బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశాడు. ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడంతో తన ఫోన్‌ను సైబర్ మోసగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుని ఖాతాను ఖాళీ చేశారని బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.
మరో కేసులో.. 15 గంటల పాటు ఫోన్‌ను కంట్రోల్‌లో పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు.
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి (28) ఓ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతామని ఫోన్ చేశారు. వారి చెప్పిన వివరాలు విని నిజంగానే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లని నమ్మాడు. ఫోన్‌లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో ఏపీకే ఫైల్‌ను పంపాడు. దానిని క్లిక్ చేశాడు. ఆ ఫైల్‌లో ఉన్న క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేశాడు. అంతే — ఆ ప్రైవేట్ ఉద్యోగి ఫోన్‌ను సైబర్ మోసగాళ్లు దాదాపు 15 గంటల పాటు తమ కంట్రోల్‌లో ఉంచుకున్నారు. మొత్తం 10 లావాదేవీల్లో ₹1.60 లక్షలు కొట్టేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






