- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీమూన్ లో హస్బెండ్ హత్య కేసు.. పెళ్లికి ముందు తండ్రితో సోనమ్ ఏం చెప్పిందంటే..
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో (Raja Raghuvanshi Murder Case) ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మే 11న ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో (Raja Raghuvanshi Murder Case) ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మే 11న ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత హనీమూన్ కు వెళ్లిన జంట మిస్సవ్వడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలించగా.. రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. ఇందులో సోనమ్ ను కీలక నిందితురాలిగా పరిగణించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రాజా హత్య ఘటన ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.
కాగా.. సోనమ్ ఇష్టంతోనే ఈ వివాహం జరిగిందా అని ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. సోనమ్ తండ్రి దేవీ సింగ్ మాట్లాడుతూ, "వివాహ ప్రతిపాదన సందర్భంగా సోనమ్‌తో స్పష్టంగా మాట్లాడాను. ఆమెకు వేరే ఎవరైనా ఉన్నారా అని అడిగితే, 'లేదు, నీవు ఎంచుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పింది. తన స్నేహితురాలితో కూడా ఇలాంటి ప్రశ్నలు మళ్లీ అడగవద్దని చెప్పమని కోరింది." అని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రాజా తల్లి ఉమా రఘువంశీ మాట్లాడుతూ, "ఇది సాధారణ అరేంజ్డ్ మ్యారేజ్ లాగే జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో మా కమ్యూనిటీ బుక్‌లెట్, సోషల్ మీడియాలో రాజా ప్రొఫైల్ పెట్టాం. సోనమ్ ప్రొఫైల్ చూసి, ఆమె కుటుంబం సంప్రదించింది. సోనమ్ కుటుంబం గురించి వాకబు చేసినప్పుడు అందరూ సానుకూలంగా స్పందించారు. ఇరు కుటుంబాలు పలుమార్లు కలిశామని, స్నేహపూరిత వాతావరణంలోనే సంబంధం ఖాయమైందని తెలిపింది.
మే 20న మేఘాలయలో హనీమూన్‌కు (Meghalya Honeymoon) వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న రాజా మృతదేహం వీసాండాంగ్ జలపాతం సమీపంలోని లోయలో లభించింది. సోనమ్‌ను జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లోని ఓ ధాబాలో కనుగొని అరెస్ట్ చేశారు. పోలీసుల ఆరోపణ ప్రకారం.. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి, కిరాయి హంతకులను ఉపయోగించి రాజాను హత్య చేయించింది.
రాజా కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, "సోనమ్‌కు వివాహం ఇష్టం లేకపోతే, ఎందుకు ముందుకు వెళ్లింది? ప్రియుడు ఉన్నప్పుడు రాజాను ఎందుకు చంపింది?" అని ప్రశ్నిస్తోంది. సోనమ్ తండ్రి దేవీ సింగ్ మాత్రం తన కుమార్తె నిర్దోషి అని, మేఘాలయ పోలీసులు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతున్నారు. ఈ దారుణ ఘటన ఇరు కుటుంబాలను, సమాజాన్ని షాక్‌లో ముంచెత్తింది. సోనమ్‌తో పాటు రాజ్ కుశ్వాహ, మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.
ఈ ఘటనపై మేఘాలయ పర్యాటక శాఖ మంత్రి పాల్ లింగ్డో స్పందించారు. ఇది ట్రయాంగిల్ లవ్ వల్ల జరిగిన కాంట్రాక్ట్ కిల్లింగ్ అన్నారు. కేసులో ప్రేమే హత్యకు కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.






