- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో..! బాత్ రూంలో కుప్పలుగా నోట్ల కట్టలు.. ADE అంబేద్కర్ బినామీ ఇంట్లో కొసాగుతోన్న ACB రెయిడ్స్
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు (ACB officials) చేపడుతున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు (ACB officials) చేపడుతున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ మేరకు ఆయనను ఉదయం ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరు పరచగా న్యాయమూర్తి అంబేద్కర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గుడా (Chanchalguda) జైలుకు తరలించారు. అయితే, తాజాగా చేవెళ్లలో నిందితుడు అంబేద్కర్ బినామీ అయిన విద్యుత్ శాఖలో ఏడీగా పని చేస్తున్న రాజేశ్ ఇంట్లో ఇవాళ సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాత్‌రూంలో ఏకంగా రూ.20 లక్షల క్యాష్ లభ్యమైంది. దీంతో మరింత నగదు దొరికే అవకాశం ఉండటంతో ఏసీబీ టీమ్ సోదాలను కొనసాగిస్తోంది.
కాగా, ఏడీఈ అంబేద్కర్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లు సహా గచ్చిబౌలి, మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో మొత్తం 15 బృందాలు మంగళవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు గుర్తించారు. అలాగే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి, మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ ఫామ్‌హౌస్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీడీ డీఎస్పీ ఆనంద్ (DSP Anand) వెల్లడించారు.






