- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. మేనల్లుడిని చంపి.. గోడలో ప్లాస్టింగ్ చేసిన అత్త..
లేబర్ కాంట్రాక్టర్ అయిన మేనల్లుడిని చంపి.. అతడిని గోడలో ప్లాస్టింగ్ చేసిందో అత్త. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: లేబర్ కాంట్రాక్టర్ అయిన మేనల్లుడిని చంపి.. అతడిని గోడలో ప్లాస్టింగ్ చేసిందో అత్త. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో వెలుగుచూసింది. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితురాలిని అరెస్ట్ చేసి.. వివరాలు రాబట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాల్డా ఇంగ్లీష్ బజార్ కు చెంది సద్దాం నదాఫ్ (31) లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ..కార్మికుల్ని ఇతర రాష్ట్రాలకు పంపేవాడు. గత నెల 18న తన ఆఫీస్ నుంచి రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోవడంతో భార్య నస్రీన్ ఖాతూన్ 23న పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. దీనివెనుక అతని మామ,అత్త.. రెహమాన్ నదాఫ్, మౌమితా హసన్ ల హస్తం ఉండొచ్చని అనుమానించింది.
రెహమాన్, మౌమితా దంపతులను పోలీసులు విచారించగా.. సద్దాంకు అతని అత్త అయిన మౌమితా హసన్ తో వివాహేతర సంబంధం ఉందని, అలాగే వారి మధ్య వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని తెలిసింది. దీంతో సద్దాం హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. మౌమితాను తమదేన శైలిలో విచారించగా.. నేరం అంగకరించింది. సద్దాంను హత్య చేసి దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని తపన్ లో ఉన్న తన తల్లి ఇంటి గోడలో సద్దాం డెడ్ బాడీని పూడ్చిపెట్టి, ప్లాస్టరింగ్ చేసినట్లు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. తపన్ పోలీసుల్ని సంప్రదించి.. జ్యుడీషియర్ మెజిస్ట్రేట్ సమక్షంలో గోడను పగలగొట్టి.. సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసిన సద్దాం డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టమ్ కు పంపారు.






