- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ కట్టించుకోవడానికి పోయి.. గన్స్‌తో ఎంట్రీ
రక్షా బంధన్ రోజు సొంత గ్రామానికి వెళ్లిన కూలీ గన్స్ తో హైదరాబాద్ కు వచ్చి రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు దొరికిపోయాడు.

దిశ, సిటీ క్రైమ్ : రక్షా బంధన్ రోజు సొంత గ్రామానికి వెళ్లిన కూలీ గన్స్ తో హైదరాబాద్ కు వచ్చి రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు దొరికిపోయాడు. కూలీ నుంచి గన్స్ విక్రయించే దందాకు శ్రీకారం చుట్టిన అతని నుంచి పోలీసులు మూడు గన్స్ , 10 బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఎస్ఓటీ డీసీపీ రమణరెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహరెడ్డితో కలిసి వెల్లడించిన వివరాల ప్రకారం… బీహార్ కు చెందిన శివకుమార్ హైదరాబాద్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి ప్రభుత్వ స్కూల్ వద్ద అద్దెకు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మేడిపల్లి లోని శ్రీకర ఫెర్టిలైజర్స్ కంపెనీలో కూలీగా(హమాలీ) పని చేస్తున్నాడు.
ఆగస్టు 6వ తేదీన శివకుమార్ రాఖీ పండుగ కోసం బీహార్ కు వెళ్ళాడు. కూలీతో వస్తున్న ఆదాయంతో ఆర్థిక కష్టాలు పెరుగుతుండడంతో తన బావ క్రిష్ణ పాశ్వాన్ తో కలిసి హైదరాబాద్ లో గన్స్ ను అసాంఘిక శక్తులకు విక్రయించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. తన బావ దగ్గర నుంచి 3 తుపాకులు, 10 బుల్లెట్ లను తీసుకుని ఇటీవల హైదరాబాద్ కు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో వాటిని విక్రయించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రాచకొండ ఎస్ఓటీ, చర్లపల్లి పోలీసులు కలిసి శివకుమార్ ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 3 గన్స్ , 10 బుల్లెట్లు దొరికాయి.
అతనిని అరెస్టు చేశారు. విచారణలో శివకుమార్ 2022 లో హైదరాబాద్ కు వలస వచ్చి చర్లపల్లిలో ఉంటున్నట్లు తెలిసింది. గతంలో శివకుమార్ గంజాయి చాక్లెట్ లను విక్రయిస్తూ పోలీసులకు దొరికి జైలుకు వెళ్లినట్లు విచారణలో బయట పడింది. శివకుమార్ బావ క్రిష్ణ పాశ్వాన్ ను అరెస్టు చేసేందుకు టీమ్స్ రంగంలోకి దిగాయని సీపీ వెల్లడించారు. శివకుమార్ ఫోన్ ను కూడా పోలీసులు విశ్లేషించి అతనిని ఎవరైనా తుపాకులను కొనుగోలు చేసేందుకు సంప్రదించారానే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ గన్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసు టీంను సీపీ అభినందించారు.






