- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల ప్రాజెక్ట్‌పై జరిగింది యాక్సిడెంట్ కాదా..? హత్యనా..? (వీడియో)
జూరాల ప్రాజెక్ట్‌పై జరిగిన యాక్సిడెంట్‌పై అనుమానాలు తలెత్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : జూరాల ప్రాజెక్ట్‌పై జరిగిన యాక్సిడెంట్‌పై అనుమానాలు తలెత్తున్నాయి. మొదట ప్రమాదంగా భావించినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే ఖచ్చితంగా అది మర్డర్ అనేది స్పష్టంగా అర్థం అవుతుందని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. మృతుడి బంధువుల్లోనూ అదే అనుమానం వస్తుంది. వాళ్లే కాదు.. ఆ వీడియోని చూసిన ఎవరైనా అది ప్రమాదం కాదనే చెబుతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..
ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ (21), జానకిరాములు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూరాల డ్యామ్ పరవళ్లను చూసేందుకు వచ్చారు. అనంతరం రాత్రి 7:30 గంటల సమయంలో డ్యామ్ బ్రిడ్జిపై నుంచి గద్వాల వైపు వెళ్తున్నారు. అందే సమయంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ వస్తూ.. సరిగ్గా మహేష్ బైక్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కు వచ్చి వారిని ఢీకొట్డాడు. దీంతో మహేష్ ఎగిరి జూరాల ప్రాజెక్ట్ 53వ గేట్‌లో పడిపోయి నీళ్లలో కొట్టుకుపోయాడు. జానికిరాములు తీవ్రగాయాలతో అక్కడే పడిపోయాడు. నరేష్ మృతి చెందినట్లు తెలుస్తుండగా.. జానికిరాములు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే, నేరుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా 180 డిగ్రీల రేంజ్‌కు పక్కకు తిరిగి మహేష్ బైక్‌ను ఢీకొట్టడం అనుమానాలకు తావిస్తోంది. కానీ అది ఖచ్చితంగా హత్యాయత్నం అనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. దీనిపై పోలీసులు లోతైన విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు తెలంగాణ వాసి, కారు డ్రైవింగ్ చేసింది కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో హత్య కోణం ఉన్నదా.. లేదా..? అన్నదానిపై స్పష్టతకు రాలేకపోతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతనే పోలీసులు ఈ కేసుపై వివరాలు వెల్లడించనున్నారు.






