నడిరోడ్డుపై మహిళను కత్తితో పొడిచి పరార్

by Sujitha Rachapalli |

విజయవాడ భవానీపురంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీదేవి అనే

నడిరోడ్డుపై మహిళను కత్తితో పొడిచి పరార్
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ భవానీపురంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీదేవి అనే మహిళను అప్పారావు అనే వ్యక్తి కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. కానీ ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం మహిళ చికిత్స పొందుతుండగా.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అప్పారావు గురించి వెతుకుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story