- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ భట్టాచారిని అరెస్ట్ చేయాలి.. VHP డిమాండ్
హైదరాబాద్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్'లో హిందూ దేవతల గురించి ప్రొఫెసర్ భట్టాచారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్'లో హిందూ దేవతల గురించి ప్రొఫెసర్ భట్టాచారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వేదాలు, భగవత్ గీతలో ఏ దేవుళ్ల విగ్రహాల గురించి ప్రస్తావించారని అన్నారు. ఎందుకు విగ్రహాలను పూజిస్తున్నారని వ్యాఖ్యానించారు. హనుమంతుడు, భక్త ప్రహల్లాదుడి చరిత్రపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించాలని వీహెచ్పీ జాతీయ కార్యదర్శి శశిధర్ కోరారు.
వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో హిందూ దేవుళ్లను తిట్టడానికి లైసెన్స్ ఇచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టాచార్య గత చరిత్ర మొత్తం వివాదాస్పదం అని అన్నారు. ఐపీఈ విద్యాసంస్థ నడిపిస్తున్నవారికి భట్టాచార్య గురించి తెలిసే ఆయనను తీసుకువచ్చి విద్యార్థుల మొదడులో విషాన్ని నాటుతున్నారని ఆరోపించారు. గతంలో భట్టాచారి ఇచ్చిన క్లాసులపై కూడా దర్యాప్తు జరగాలన్నారు. వెంటనే భట్టాచారిని అరెస్ట్ చేయకపోతే హిందూ సమాజం రోడ్లపైకి వస్తుందని హెచ్చరించారు.






