- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం.. ఏకంగా 10 మందికిపైగా గాయాలు
by Kema Shiva Kumar |
శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ టోల్‌గేట్ వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం భక్తులపైకి దూసుకెళ్లింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ టోల్‌గేట్ (Toll Gate) వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, తోటి భక్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా.. లేక డ్రైవర్ అజాగ్రత్త కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






