- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలిగొండ మాజీ శాఖ గ్రంధాలయ చైర్మన్ ఆత్మహత్య
వలిగొండ మాజీ శాఖ గ్రంథాలయ చైర్మన్ పల్లెర్ల ప్రకాష్ క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాలు పట్టణంలోని మల్లెపల్లికి చెందిన పల్లెర్ల ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

X
దిశ, వలిగొండ: వలిగొండ మాజీ శాఖ గ్రంథాలయ చైర్మన్ పల్లెర్ల ప్రకాష్ క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాలు పట్టణంలోని మల్లెపల్లికి చెందిన పల్లెర్ల ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం తెల్లవారుజామున చెరువు వద్ద ఉన్న ముత్యాలమ్మ తల్లి దేవాలయం ముందు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై పెండ్యాల ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి పల్లెర్ల ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






