యోగా టీచర్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలో యోగా టీచర్ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. జూలై 30న తన గదిలో నిర్జీవంగా కనిపించిన ఆమెను గొంతు పిసికి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. తలపై గాయాలు ఉన్నాయని కూడా గుర్తించబడింది.

యోగా టీచర్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలో యోగా టీచర్ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. జూలై 30న తన గదిలో నిర్జీవంగా కనిపించిన ఆమెను గొంతు పిసికి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. తలపై గాయాలు ఉన్నాయని కూడా గుర్తించబడింది. కాగా ఈ కేసులో నిందితుడు అభయ్ కుమార్‌ను నేపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అభయ్, అజయ్ ఇద్దరు సోదరులు కాగా. అజయ్ హల్ద్వానీలోని ఓ పాపులర్ డయాగ్నోసిస్ సెంటర్ టాప్ ఫ్లోర్‌లో యోగా సెంటర్ నడుపుతున్నాడు. అక్కడే జ్యోతి యోగా టీచర్‌గా పని చేసేది. ఈ క్రమంలో అజయ్‌, జ్యోతి మధ్య రొమాంటిక్ రిలేషన్ ఏర్పడింది. ఈ విషయం అభయ్‌కు కూడా తెలుసు. అయితే అభయ్ లైఫ్ మీద సీరియస్‌గా లేకపోవడంతో అతన్ని ఇంటి నుంచి గెంటేశాడు సోదరుడు. డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. దీంతో దీనంతటికి కారణం జ్యోతి అని భావించి.. ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. ఏకంగా హతమార్చాడు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి.. దుపట్టాతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత నైనిటాల్ మీదుగా నేపాల్‌కు పారిపోయాడు. కాగా సీసీటీవీ ఫుటేజీ‌లో అభయ్ జ్యోతి గదికి వెళ్లి, బయటకు వచ్చిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తానికి నిందితుడిని పట్టుకున్నారు.

Next Story