ఉరేసుకొని మ‌హిళా ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

దిశ, రాజంపేట : ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి మండలంలోని తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది.

ఉరేసుకొని మ‌హిళా ఆత్మ‌హ‌త్య
X

దిశ, రాజంపేట : ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి మండలంలోని తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడ్ల గ్రామానికి చెందిన బోయిని బాలమణి (35) గురువారం రాత్రి భర్తతో గొడవ పడి ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించింది. మృతురాలు సోదరుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై రాజు తెలిపారు. అనంతరం మృతు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన‌ట్టు తెలిపారు.

Next Story