మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. 35 మందికి గాయాలు(VIDEO)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-24 09:25:48  IST  )

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వేగాన్ని అదుపు చేసే క్రమంలో బస్సు రోడ్డు పక్కనే ఉన్న మదర్ డెయిరీ ఫామ్‌లోకి దూసుకెళ్లింది.

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. 35 మందికి గాయాలు(VIDEO)
X

దిశ, వెబ్ బెస్క్ : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వేగాన్ని అదుపు చేసే క్రమంలో బస్సు రోడ్డు పక్కనే ఉన్న మదర్ డెయిరీ ఫామ్‌లోకి దూసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్ ఇటావాలో ఈ ప్రమాదం జరగ్గా.. బస్సులో ఉన్న 33 మంది, సెక్యూరిటీ గార్డులు ఇద్దరు గాయపడినట్లు సమాచారం. కాగా వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైఫాయ్ యూనివర్సిటీ ఎమర్జెన్సీ ట్రామా సెంటర్‌కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై స్పందించిన సెక్యూరిటీ గార్డు.. ‘మరణానికి తాకి తిరిగి వచ్చేశాను’ అని తెలిపాడు.

VIDEO

Read More... బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. డోర్ లో నుంచి జారిపడి ప్యాసింజర్ దుర్మరణం

Next Story