అత్తతో భర్త ఇల్లీగల్ ఎఫైర్.. భార్య హత్య తర్వాత అశ్లీల ఫోటోలు వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-10-09 09:12:32  IST  )

యూపీలో మరో ఘోరం వెలుగు చూసింది.

అత్తతో భర్త ఇల్లీగల్ ఎఫైర్.. భార్య హత్య తర్వాత అశ్లీల ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భార్య తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్త కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. యూపీలోని కాస్‍గంజ్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సిధ్‍పురాలో నివసించే ప్రమోద్ (20), శివానికి 2018లో వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్య శివాని తల్లితో ప్రమోద్‍కు చనువు పెరిగింది. ఈ చనువు కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రమోద్, శివానికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అయితే ఇటీవల ఈ భార్య భర్తల మధ్య గొడవ తీవ్ర స్థాయిలో చేరింది. ఇంతలో ఏమనుకున్నాడో ఏమో కానీ ప్రమోద్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. అనుమానాస్పదంగా శివాని చనిపోయిందనే సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ శివాని డెడ్ బాడీని గుర్తించారు. అయితే ప్రమోద్ కు తన అత్తతో ఎఫైర్ ఉందనే విషయాన్ని శివాని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. శివాని హత్య నేపత్యంలో ప్రమోద్, తన అత్తతో కలిసి ఉన్నప్పటి అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story