- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో దారుణం.. రూ.22 కోసం హత్య
రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.22 కోసం ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.22 కోసం ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహ్మద్ సిరాజ్ అనే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందిన మహేశ్ కుమార్ వర్మతో కలిసి అనంతసాగర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే సంక్రాంతి పండుగ రోజు అంతా కలిసి మద్యం సేవించగా మహేశ్ తన బాకీ రూ.22 ఇవ్వాలని సిరాజ్ ను కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా మద్యం మత్తులో మహేశ్ విచక్షణ కోల్పోయి సిరాజ్ తలను అక్కడే ఉన్న చెట్టుకు బలంగా కొట్టాడు. ఆపై బండరాయితో తలపై బాదాడు. దీంతో తీవ్రగాయాలైన సిరాజ్ అక్కడిక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా ఈ హత్య తానే చేశానని నిందితుడు మహేశ్ అంగీకరించాడు. కేవలం రూ.22 కోసం హత్య చేయడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడంది.






