అడవిలో అత్యాచారం.. మానసిక స్థితి సరిగ్గా లేని యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. చివరకు ఆత్మహత్య..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 23ఏళ్ల మానసిక స్థితి సరిగ్గా లేని అమ్మాయిపై అత్యాచారం, ఆత్మహత్య స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మాటలు రాని, చెవులు కూడా వినబడని

అడవిలో అత్యాచారం.. మానసిక స్థితి సరిగ్గా లేని యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. చివరకు ఆత్మహత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో తారుణం చోటు చేసుకుంది. 23ఏళ్ల మానసిక స్థితి సరిగ్గా లేని అమ్మాయిపై అత్యాచారం, ఆత్మహత్య స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మాటలు రాని, చెవులు కూడా వినబడని ఈ యువతికి సాయం చేస్తామని నిథోరా గ్రామం నుంచి అడవికి తీసుకెళ్లారు ముగ్గురు యువకులు. అక్కడే ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆగస్టు 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. బాధను భరించలేని యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. బాధితురాలికి దేవుడు పుట్టినప్పటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నాడని బాధపడుతున్నారు నెటిజన్లు. నిందితులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story