కూతురి వయసు ఉన్న అమ్మాయితో బీజేపీ నేత పాడుపని.. షాకింగ్ ఫోటోలు వైరల్

by Ajay Maddhiboyina |

ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్ధార్థ్‌నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్ అగ్రహారి (gowri shankar) మైనర్ బాలికతో అసభ్యకరంగా ఉన్న వీడియోలు బయకు వచ్చాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

కూతురి వయసు ఉన్న అమ్మాయితో బీజేపీ నేత పాడుపని.. షాకింగ్ ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్ధార్థ్‌నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్ అగ్రహారి (gowri shankar) మైనర్ బాలికతో అసభ్యకరంగా ఉన్న వీడియోలు బయకు వచ్చాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పార్టీ నుండి అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గతంలో ఓ బీజేపీ నేత హైవేపై కారు ఆపి మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు.

ఆ ఫోటోలు వైర‌ల్ (viral) అవ్వ‌డంతో తీవ్ర విమర్శ‌లు రాగా ఆయ‌న్ను కూడా పార్టీ స‌స్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు యూపీలో అధికారంలో ఉండి, పార్టీ జిల్లా ఉపాధ్య‌క్షుడిగా ఉండి మైన‌ర్ బాలిక‌తో గ‌డ‌ప‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మ‌హిళ చిత్రీకరించ‌డంతో ఆమెపై, బీజేపీ నాయ‌కుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గౌరీశంక‌ర్ మాత్రం ఆ ఫోటోలో ఉన్న‌ది తాను కాద‌ని బుకాయిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Next Story