- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేత అత్యాచారం కేసు.. బాధిత కుటుంబాన్ని ఈడ్చుకెళ్లిన పోలీసులు
ఉన్నావ్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సింగార్ ఉద్యోగం పేరుతో ఎరవేసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: ఉన్నావ్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సింగార్ ఉద్యోగం పేరుతో ఎరవేసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో పాటు అమ్మేసే ప్రయత్నం కూడా చేశాడు. పోలీసులు బాలికను రక్షించడంతో బయటపడింది. తరవాత న్యాయపోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తరవాత బాధితురాలు సీఎం యోగి అధిత్యానాథ్ ఇంటిముందు ధర్నాకు దిగడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు గురించి మీడియాలో మారుమోగింది. తనపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని కోర్టుకు వస్తున్న సమయంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ బాధితురాలి వాహనం పై దాడి చేయగా ఆమె తండ్రి మరణించాడు.
ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుల్దీప్ సింగ్ కు కొన్ని నెలల క్రితం జీవిత ఖైదు విధించారు. అయితే ఇటీవల కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి శిక్షను రద్దు చేసింది. దీంతో అత్యాచారం చేసి తన తండ్రిని చంపిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడం అన్యాయం అని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. అయితే వారి పట్ల సీఆర్పీఎఫ్ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. బాధితులను నిరసన తెలపకుండా ఈడ్చుకెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు. దీనిపై బాధితురాలు మాట్లాడుతూ.. తమను సీఆర్పీఎఫ్ సిబ్బంది చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. కుల్దీప్ బెయిల్ రద్దు చేయాలని.. లేదంటే తమను చంపేస్తారని తాము సురక్షితంగా లేమని చెప్పారు. VIDEO






