- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామచంద్రపురం బాలిక మృతి కేసులో ఊహించని ట్విస్ట్.. హంతకుడే వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పదేళ్ల చిన్నారి సిర్రా రంజిత అనుమానాస్పద స్థితిలో మూడు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న రంజిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పదేళ్ల చిన్నారి సిర్రా రంజిత అనుమానాస్పద స్థితిలో మూడు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న రంజిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడం సంచలనంగా మారింది. తల్లి దండ్రులు కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా పోలీసులు బాలికది హత్యగా గుర్తించారు. బాలికను శ్రీను అనే నిందితుడు హత్య చేసినట్టు నిర్దారించారు.
బాలిక కుటుంబం అద్దెకు ఉంటున్న భవనంలో శ్రీను స్నేహితుడికి షాప్ ఉంది. దీంతో తరచూ అక్కడకు వెళుతున్న శ్రీనుకు బాలిక కుటుంబంతోనూ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫ్యాన్ రిపేర్ పేరుతో వారి ఇంటికెళ్లిన నిందితుడు హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు పోలీసులతోనే తిరగటంతో ఎలాంటి అనుమానం రాలేదు. అంతే కాకుండా నిందితులను త్వరగా పట్టుకోవాలని సైతం అతడు లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పెడుతూ అందరినీ నమ్మించాడు. అయితే బాలికను ఎందుకు హత్య చేశాడు అనేది ఇంకా నిర్దారించలేదు. కానీ బాలిక తల్లి సునీతతో శ్రీను ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.






