- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్పల్లిలో బాలిక హత్య కేసులో నమ్మలేని నిజాలు
హైదరాబాద్ లోని కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రయివేట్ ఉద్యోగులు కావడంతో.. వారు ఉద్యోగానికి వెళ్లగా బాలిక ఒక్కతే ఇంట్లో ఉన్నది చూసి ఓ యువకుడి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. బాలిక ప్రతిఘటించడంతో పొడిచి చంపి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. అయితే పోలీసులు మాత్రం బంధువులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అత్యాచార హత్యా యత్నం అయి కూడా ఉండవచ్చని ఊహిస్తున్నారు.
ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. సహస్ర బోయిన్ పల్లి కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. సీసీ టీవీలో నమోదైన యువకుని గురించి పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఒక్కగానొక్క కూతురు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు శోకం ఆకాశాన్నంటింది.
Also Read: ఆరో తరగతి అమ్మాయిని అంత దారుణంగా హత్య చేసింది ఎవరు..?






