వ‌రుస‌కు అన్న.. వేధింపులు త‌ట్టుకోలేక బాలిక ఆత్మ‌హ‌త్య‌

by Ratna Kumari |   (  Updated:2026-03-04 11:41:16  IST  )

జగిత్యాల జిల్లాలో సభ్య సమాజాన్ని కలిచి వేసే విషాద ఘటన వెలుగు చూసింది. వరుసకు అన్న అయిన ఓ యువకుడు మైనర్ బాలికకి మాయమాటలు చెప్పి లొంగ‌దీసుకొని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంత‌టితో ఆగ‌కుండా వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

వ‌రుస‌కు అన్న.. వేధింపులు త‌ట్టుకోలేక బాలిక ఆత్మ‌హ‌త్య‌
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో సభ్య సమాజాన్ని కలిచి వేసే విషాద ఘటన వెలుగు చూసింది. వరుసకు అన్నయ్య అయిన ఓ యువకుడు మైనర్ బాలికకి మాయమాటలు చెప్పి లొంగ దీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బ్లాక్‌ మెయిల్ చేస్తూ మానసిక వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి లోనైన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నరసయ్యపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక జగిత్యాలలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయిన మనోజ్ అనే యువకుడు దగ్గరై పలు సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.


గత కొంతకాలంగా బాలికను దూరం పెట్టడంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 8న బాలిక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులు నిందితుడిపై పోక్సో, అత్యాచారం కేసులతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story