- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: వేధింపులు భరించలేక.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సంగీత (33) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సంగీత (33) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం మట్టెవాడలోని తన నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు సంగీత రాసిన ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) లభ్యమైంది. తన మరణానికి తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సదరు కానిస్టేబుల్ తనను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాడని, ఆ వేధింపులు భరించలేకనే ఈ విపరీత నిర్ణయం తీసుకుంటున్నానని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల దర్యాప్తు..
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగీత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య లేఖలో పేర్కొన్న కానిస్టేబుల్ ఎవరు? వేధింపుల వెనుక ఉన్న కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంగీత ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే సంగీత ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే ఇలాంటి వేధింపులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.






