- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య..
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మొయినాబాద్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామానికి చెందిన అల్లాపురం సుజాత(40) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పర్వత్ పల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తో 2002లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు కుటుంబం సాపిగానే కొనసాగిందని తదనంతరం తన భర్త డబ్బుల కోసం మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని కూతురు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పేదని మృతురాలి తండ్రి వాపోయాడు.
నాలుగు నెలల క్రితం కుటుంబంతో సహా వచ్చి మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుందని తెలిపారు. కాగా సోమవారం రాత్రి అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయిందని, మృతి చెందడానికి నా అల్లుడు నరసింహారెడ్డి కారణమని అతనిపైనే అనుమానం ఉందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






