ప్రేమోన్మాదికి ఉరి..!

by Ratna Kumari |

అర్ధరాత్రి ఓ ప్రేమోన్మాది జరిపిన మారణ కాండకు నిండు కుటుంబం బలైంది. ఇది గడచి రెండేళ్లు. నేడు నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రేమోన్మాదికి ఉరి..!
X

దిశ, నర్సంపేట : అర్ధరాత్రి ఓ ప్రేమోన్మాది జరిపిన మారణ కాండకు నిండు కుటుంబం బలైంది. ఇది గడచి రెండేళ్లు. నేడు నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు రెండేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నారు. నేడు తమను తమ తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన కిరాతకుడికి శిక్ష పడటంతో బాధిత కుటుంబం, తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది..?


వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక, గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 2023లో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గతేడాది నవంబర్ లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. హైద‌రాబాద్ కి వెళ్ళారు. కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. జనవరిలో యువతి తల్లిదండ్రులు చెన్నరావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏకాభిప్రాయానికి రావడంతో తల్లిదండ్రులతో యువతిని పంపించారు. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నాగరాజు రగిలిపోయాడు. 2024 జూలై 10 వ తేదీ బుధవారం రాత్రి మద్యం తాగి కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు రేకుల షెడ్డు కింద పడుకున్న సుగుణ, శ్రీనివాస్ పై కత్తితో దాడి చేశాడు. అరుపులకు ఇంట్లో పడుకున్న అక్క తమ్ముళ్ళు బయటికి వచ్చేసరికి వాళ్లపైనా దాడికి పాల్పడ్డాడు. గొడవ కావడంతో తండా వాసులంతా రావడంతో నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో సుగుణ స్పాట్ లోనే చనిపోగా.. శ్రీనివాస్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి తమ్ముడిని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Next Story