పెళ్లికి అతిథుల్లా వచ్చి దొంగలుగా మారారు! బురఖాలు ధరించి హ్యాండ్‌బ్యాగ్‌లు చోరీ.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-12-27 11:48:46  IST  )

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట ఎక్స్‌రోడ్డు సమీపంలోని మన్నత్ ఫంక్షన్ హాల్‌లో తాజాగా జరిగిన ఓ శుభకార్య వేడుకలో చోరీ ఘటన కలకలం రేపింది.

పెళ్లికి అతిథుల్లా వచ్చి దొంగలుగా మారారు! బురఖాలు ధరించి హ్యాండ్‌బ్యాగ్‌లు చోరీ.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట ఎక్స్‌రోడ్డు సమీపంలోని మన్నత్ ఫంక్షన్ హాల్‌లో తాజాగా జరిగిన ఓ శుభకార్య వేడుకలో చోరీ ఘటన కలకలం రేపింది. బురఖాలు ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు వివాహ వేడుకకు హాజరై, మహిళా అతిథుల హ్యాండ్‌బ్యాగ్‌లు చోరీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చోరీకి పాల్పడిన వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు బాలిక మాదిరిగా కనిపిస్తున్నారని సమాచారం. వేడుక ముగిసిన అనంతరం పలువురు మహిళలు తమ పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు కనిపించకపోవడంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన యాజమాన్యం సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, ఇద్దరు బురఖా ధరించిన మహిళలు బ్యాగ్‌లు తీసుకుని హాల్ నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఫంక్షన్ హాల్‌లు, వివాహ వేడుకల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీడియో ఇదే..

Read More..

సైబర్ క్రైమ్ కేసు కలకలం.. రూ.2.50 కోట్లు ఖాతాలో జమ పై ఫిర్యాదు

Next Story