AP: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌..ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కు ఢీ కొట్టి, ద్విచక్ర వాహదారులు మృతి చెందారు.

AP: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌..ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ఈ రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం లాంటి కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో టూ - వీలర్ వాహనదారులు ఇద్దరు మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా అక్కి వలస హైవే పైన ఆగి ఉన్న లారీని ఓ బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ సందర్భంగా విశాఖకు సంబంధించిన నరేంద్ర, ఆయన తల్లి నాగమణి మృతి చెందారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. క్లిక్

Next Story