- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకులు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్
బైక్ ను దొంగలించిన ఇద్దరు దొంగలను నాగోల్ పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దిశ,వనస్థలిపురం: బైక్ ను దొంగలించిన ఇద్దరు దొంగలను నాగోల్ పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోల్ ఎస్‌హెచ్‌వో ఎండీ మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. ఆనంద్‌నగర్‌కు చెందిన విద్యార్థి జి. భానుచరణ్ శ్రీ దుర్గా బాయ్స్‌హాస్టల్ ఎదురుగా ఆదివారం రాత్రి పది గంటలకు తన పల్సర్‌బైక్‌ను పార్క్ చేసి తిరిగి సోమవారం ఉదయం లేచి చూసుకునేసరికి బైక్కనిపించలేదు. వెంటనే బాధితుడు నాగోల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ ఎస్సై నరసింహ ఆధ్వర్యంలో క్రైమ్ టీం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. నేరస్తులు నాగోల్చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా నెంబర్ ప్లేట్ లేని బండి పై తిరుగుతున్నట్లు గుర్తించారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న క్రైమ్ టీమ్‌సభ్యులు పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించారు. ఇద్దరిలో ఒకరు గుంటూరు జిల్లా మాచర్ల మండలం పెద్దగోదమ్ముల గ్రామానికి చెందిన కడియం హోసన్న , మరొకరు గుంటూరు జిల్లా మాచర్ల మండలం , కంభంపాడు గ్రామానికి చెందిన కలివెల నాగేంద్ర బాబు గా గుర్తించారు. ఇద్దరు కలిసి పల్సర్‌బైక్‌ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరు గుంటూరు లో కూడా కొన్ని బైకులు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో ఎండీ మక్బూల్ జానీ తెలిపారు.






