విశాఖ తీరంలో విషాదం.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

by Malleboina Mahesh |

సరదాగా ఆడుకుంటూ ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం బీచ్ లో చోటు చేసుకుంది.

విశాఖ తీరంలో విషాదం.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: సరదాగా ఆడుకుంటూ ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం బీచ్ లో చోటు చేసుకుంది. VUDA పార్క్‌ లైట్ హౌస్‌ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన ఎనిమిది మంది స్నేహితుల్లో ఇద్దరు సముద్రపు అలలతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్నేహితులందరూ కలిసి బీచ్‌లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఎగిసిపడ్డ రాకాసి అలలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో డిగ్రీ విద్యార్థులు ఆదిత్య, తేజస్ నీటిలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గజ ఈతగాళ్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను వేగవంతం చేశారు. సముద్రంలో గల్లంతైన వారిని రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్‌గా పోలీసులు గుర్తించారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శోధన కార్యక్రమం సవాలుగా మారింది. విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story